ఖమ్మం @ 43.3

 

Temperature

గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. మంగళవారం ఉష్ణోగ్రతలుమరింత పెరిగి పలు చోట్ల 43 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ముదిగొండ మండలంలోని బాణాపురం, పమ్మిలో అత్యధికంగా 43.3, ఖమ్మం నగరంలోని ఖానాపురం పీఎస్, ఎర్రుపాలెం మండల కేంద్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక జిల్లాలోని ముదిగొండ, రఘునాధ పాలెం, చింతకాని, గౌరవరం, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్, ప్రకాష్ నగర్, కారేపల్లి, లింగాల, వైరా, కొణిజర్ల, పెనుబల్లి, కాకరవాయి, కుర్నవల్లి, గంగారం, తల్లాడ, మధిర, కల్లూరు, వేంసూరు, పల్లె గూడెం, సదాశివుని పాలెం, తిరుమలాయ పాలెం, కూసుమంచి, ఏనుకూరు, పెద గోపతి, బచ్చోడు, పంగిడి, గుబ్బగుర్తి, తిమ్మారావు పేట, మంచుకొండ, సిరిపురంలో 40 నుండి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెండు రోజులుగా రాత్రి పూట కూడా వాతావరణం చల్లబడడం లేదు. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకొనేందుకు శీతల పానియాలను సేవిస్తున్నారు. కొబ్బరి బోండాలు, నిమ్మ, చెరుకు రసాలకు బాగా గిరాకీ పెరిగింది.   

Comments

Popular Posts

యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

జర్నలిస్ట్ పాసులపై టోల్ టాక్స్, సెస్సులు తొలగించండి