35 ఎకరాలు ... రూ.166 కోట్లు... కొత్త మెడికల్ కళాశాల భవన నిర్మాణం
- నేడు శంకుస్థాపన చేయనున్న భట్టి, తుమ్మల, రాజనర్సింహ, పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. ఖమ్మం మెడికల్కళాశాలకు అత్యాధునిక హంగులతో కార్పొరేట్ తరహాలో కొత్త భవనాలకు గురువారం ఉప
ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి భూమి పూజ చేయనున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా
నిర్వహించనున్న మెడికల్ కళాశాల ప్రస్తుతం చాలీచాలని భవనాలలో కొనసాగుతోంది. ఈ
నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యేక చొరవ చూపి ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి సహకారంతో ఖమ్మం మెడికల్ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
రఘునాథపాలెం మండలం బల్లేపల్లి శివారులోని 35.03 ఎకరాలలో 166 కోట్ల వ్యయంతో ఈ మెడికల్
కళాశాల నూతన భవనాలను నిర్మించబోతున్నారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న ఖమ్మం మెడికల్ కళాశాల నిర్మాణం
అద్భుతంగా అత్యాధునికంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులతో వుండేలా
ప్రణాళిక తయారు చేశారు. కార్పొరేట్ వైద్య కళాశాలలను తలదన్నేలా నిర్మాణం
చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పనులు శరవేగంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు
సాగుతున్నారు. భవిష్యత్తులో విశ్వ విద్యాలయం ఏర్పాటు, ఇతర అవకాశాలకు అనుగుణంగా
దీనిని అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు.

Comments
Post a Comment