పాలేరు కదం తొక్కాలే ... వరంగల్ దద్ధరిల్లాలే

 

MP Vaddiraju Ravichandra

  • బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపు
  • తిరుమలాయపాలెంలో పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బహిరంగ సభకు పాలేరు నియోజకవర్గం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున కదం తొక్కాలని, గులాబీ సైన్యం కవాతుతో వరంగల్ దద్ధరిల్లాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం తిరుమలాయపాలెంలో పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై కేవలం ఏడాది లోనే ప్రజల్లో భ్రమలు తొలగి పోయాయని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తాము ఏం కోల్పోయామో ప్రజలంతా గ్రహించారని అన్నారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అత్యుత్సాహం ప్రదర్శించి, అడవులను ధ్వంసం చేసి సుప్రీంకోర్టు చీవాట్లు తినాల్సి వచ్చిందన్నారు. నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం చూపి.. కేసులు పెట్టి నిర్భంధాలకు గురిచేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై  ప్రత్యేక దృష్టి సారించబోతోందని, సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి కమిటీల నియామకం జరపబోతోందని అన్నారు. రజతోత్సవ సభను సక్సెస్ చేయడంలో పాలేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు సూధన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు  కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బాష బోయిన వీరన్న, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, మాజీ ఎంపీపీలు బెల్లం ఉమా, మాజీ జెడ్పీటీసీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి