దేశంలో నిరంకుశ పాలన సాగుతోంది

 

Khammam Congress

  • కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
  • సోనియా, రాహుల్ పై కేసులకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

దేశంలో బీజేపీ నిరంకుశ పాలన, మోడీ, షాల అరాచకత్వం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఇన్కమ్ టాక్స్ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం ఖమ్మలోని జీఎస్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ అగ్రనాయకులపై నిరాధారమైన ఆరోపణలతో కేసులు పెట్టారని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం జేబులో వున్న రాజ్యాంగ సంస్థలను వాడుకొని సిగ్గు మాలిన రాజకీయాలకు తెర లేపిందని ద్వజ మెత్తారు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అతి త్వరలోనే భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు, దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణనలను గతంలో విచారించిన కోర్టు, ఎటువంటి తప్పు జరగలేదని తీర్పు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే కేసుని బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెర పైకి తెస్తున్నారని, గాంధీ కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ సారి బీహార్ ఎనికల్లో కూడా గెలిచి బీజేపీకి ఖచ్చితంగా బుద్ది చెబుతామన్నారు. రాష్ట్ర గిడ్డంగుల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ గాంధీ కుటుంబంపై ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు. ఖమ్మం నగర మేయర్ పునుగొల్ల నీరజ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంత రావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ దిరిశాల చిన్న వేంకటేశ్వర రావు, నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వహక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేందర్, పైడిపల్లి కవిత సత్యనారాయణ, మలీదు వేంకటేశ్వర రావు, లకావత్ సైదులు నాయక్, కొప్పేర సరిత ఉపేందర్, మండడపు లక్ష్మీ మనోహర్, గజ్జల లక్ష్మీ వెంకన్న, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి, కమర్తపు మురళీ, రాపర్తి శరత్, కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ, నాయకులు కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి