వరంగల్ సభకు ఉత్సాహంగా కదలండి
- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపు
వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు పార్టీ కార్యకర్తలు కొత్త
ఉత్సాహంతో బయలు దేరాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపు నిచ్చారు.
సోమవారం రాత్రి ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డి పాలెంలో వేమిరెడ్డి శ్రీనివాస్
రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ రవిచంద్ర
ముఖ్య అతిథిగా హాజరై, ఏప్రిల్
27న జరిగే సభ
విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు. పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ సభ తెలంగాణ
చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతోందని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల
ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా
పశ్చాత్తాప పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అడగని పథకాలు సైతం ఆచరణలో అమలు చేసి
చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. వరంగల్ సభకు వాహనాల ఏర్పాటు, సదుపాయాల కల్పనపై
జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సమీక్షించారు. ఆ రోజు గ్రామ గ్రామాన పార్టీ
జెండాలు ఆవిష్కరించి, వరంగల్
బయలుదేరాలని సూచించారు. తొలుత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు
నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నేతలు
ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ
సభ్యురాలు శీలం కవిత, గ్రామ
సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment