Posts

Showing posts from November, 2023

ఓట్ల కోసం ఎన్ని విద్యలో ... చెప్పులు పాలీష్ చేసిన మంత్రి పువ్వాడ

Image
కూటి కోసం కోటి విద్యలన్నారు గానీ ... ఓట్ల కోసం ఎన్నివిద్యలో ... అంటే బాగుండేది. ఎందుకంటే ... ఎన్నికల వేళ ... పోటీ చేస్తున్నఅభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతుంటారు. చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తారు. పిల్లల్ని ఎత్తుకోవడం , టీ కాయడం , దోశలు వేయడం , అన్నం తినిపించడం , స్నానం చేయించడం ...  ఇవన్నీ సహజంగా ఎన్నికల ప్రచారంలో చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాలలో ఇంతకన్నా ఆశక్తికరంగా అభ్యర్థులు ప్రచారం చేస్తుంటారు. అటువంటి ఆశక్తికర ప్రచారమే ఈ రోజు ఖమ్మం నగరంలో జరిగింది. ఖమ్మం నియోజకవర్గ బి. ఆర్. ఎస్ అభ్యర్థి , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు చెప్పులు పాలీష్ చేశారు. స్టేషన్ రోడ్డులో తన ఎన్నికల ప్రచారాన్ని సాగించిన పువ్వాడ ... చెప్పులు కుట్టే దళిత కార్మికుడ్ని తనకు ఓటేయమని కోరారు. ఆ తర్వాత అక్కడే ... క్రింద కూర్చొని చెప్పులకు పాలీష్ చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ... మీకు సేవకుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల బాగోగులు చూసేది తమ ప్రభుత్వమేనని ... అందుకే ... మరోసారి బి. ఆర్.ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. అంతకు ముందు ... అక్కడే ఉన్న పాన్ షాప్...

జెండా లేకపోయినా ... ఎజెండాతో షేక్ చేస్తున్న బర్రెలక్క

Image
కదిలే ... ఓ అడుగు యువతకు ... నువు వెలుగు కదిలిందీ ... కదిలిందీ మన బర్రెలక్క అదిగో లేవర యువత యుద్దమై కదలర యువత సిద్దమై పల్లె పల్లెన యువత మేలుకో బానిస లాంటి బతుకు వదులుకో కదిలిరార యువత ... | అంటూ ... కొల్లాపూర్ వీధుల్లో వినిపిస్తున్న ఈ పాట ... ఇప్పుడు తెలంగాణ యువత గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రధానంగా నిరుద్యోగ యువతను ఆలోచింపజేస్తూ ... రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. నేతలంతా ... తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన వేళ ... నాగర్ కర్నూల్ జిల్లా ... కొండాపూర్లో నిరుద్యోగుల ప్రతినిధినంటూ ... స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ... చాపకింద నీరులా ప్రచారం సాగిస్తోన్న బర్రెలక్క ... ఇప్పుడు ఆ నియోజకవర్గ అభ్యర్థులనే కాకుండా ... రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులను కూడా ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది, ఈసారి విజయం మాదే ... మళ్ళీ మేమే గెలుస్తామనే అభ్యర్థులు సహితం ... ఈ ఎన్నికల్లో బర్రెలక్క ప్రభావం ఏమైనా ... తమపై ఉంటుందా ? ... అని ఒకసారి ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం ... కొండాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కే ... జెండా లేకపోయినా ... ఎత్తుకున్న ఎజెండాతో తెలంగాణ యువతను విపరీతంగా ...