పేదలకు సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- 500 రూపాయల బోనస్ తో పెరిగిన సన్న బియ్యం సాగు
- సన్న బియ్యం పంపిణీతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు అడ్డుకట్ట
- లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన చేసిన మంత్రి తుమ్మల
దేశంలో పేదలకు సన్న బియ్యం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల
నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన రఘునాథపాలెం మండలంలోని బూడిదం పాడు గ్రామంలో సన్న
బియ్యం లబ్ధిదారుడు గుడి బండ్ల రాజారావు ఇంట్లో పోలీసు కమీషనర్ సునీల్ దత్, జిల్లా ఇంచార్జ్
కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలనాగేశ్వర రావు మాట్లాడుతూ కూలీ చేసుకునే కుటుంబం నేడు సంతోషంతగా సన్న బియ్యంతో భోజనం
చేస్తుందన్నారు. గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా అందించే దొడ్డు బియ్యం
బయట మార్కెట్ లో 10
రూపాయలకు అమ్ముకొని, కూలీ
చేసిన డబ్బులతో సన్న బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ప్రతి
సభ్యునికి ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో సంతోషంగా భోజనం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
సన్న బియ్యం పంపిణీ ద్వారా రైతులకు కూడా లాభం జరగాలని ప్రభుత్వం క్వింటాల్ సన్న
ధాన్యంపై మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు.
గతంలో దిగుబడి అధికంగా వస్తుందని రైతులంతా దొడ్డు బియ్యం మాత్రమే సాగు చేసే వారని, నేడు ప్రభుత్వం
అందిస్తున్న బోనస్ వల్ల 20 శాతం ఉన్న సన్న వడ్ల సాగు ఇప్పుడు 80 శాతం వరకు పెరిగిందన్నారు.
పేదలు కూడా ధనవంతులు లాగా సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్న బియ్యం
పంపిణీ చేస్తుందని, సన్న
బియ్యం పంపిణితో రీసైక్లింగ్ కు అడ్డుకట్ట వేశామని చెప్పారు. సన్న బియ్యం అర్హులకు
మాత్రమే అందాలని, ఎక్కడా
పక్క దారి పట్టకుండా అధికారులు జాగ్రత్త వహించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పథకాన్ని
పేదలు సక్రమంగా వాడుకోవాలని కోరారు. అనంతరం మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ
గ్రామంలో రైతు బజార్ నిర్మాణానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు సదుపాయాల కల్పన పనులకు
శంకుస్థాపన చేశారు. అలాగే బూడిదంపాడు -పుటాని తండా జెడ్పి రోడ్డు నుంచి వాంకుడో త్
తండా రోడ్డు వరకు రూ. 2 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి రోడ్డు నిర్మాణానికి, బూడిదంపాడు ఎస్సీ
కాలనీలో రూ. 80
లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణానికి, ఆర్ అండ్ బి రోడ్డు నుండి
బూడిదం పాడు గ్రామం వరకు రూ. 150 లక్షల అంచనాలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణ
పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, ఆర్ అండ్ బి ఎస్ఇ
యుగంధర్,
ఖమ్మం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డివిజనల్ పంచాయతీ అధికారి
రాంబాబు,
తదితరులు
పాల్గొన్నారు.

Comments
Post a Comment