రామయ్య చిరకాల కోరికలు తీరుస్తాం
- సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తానన్న మంత్రి పొంగులేటి
- రామయ్య కోరికలను పొంగులేటి దృష్టికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు
మిగిలి పోయిన వన జీవి రామయ్య చిరకాల కోరికలు తీర్చేందుకు రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి రామయ్య కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన రాష్ట్ర
ప్రభుత్వం తరుపున ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో రామయ్య భౌతిక కాయాన్ని
సందర్శించి ఘనంగా వాళులర్పించారు. ఈ సందర్భంగా వన జీవి రామయ్యకు చిరకాల కోరికలు
కొన్ని వున్నాయని,
వాటిని ప్రభుత్వం తరుపున నెరవే ర్చమని కుటుంబ సభ్యులు మంత్రి పొంగులేటిని కోరడంతో
ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. రామయ్య కోరికల సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి నెర వేర్చే
ప్రయత్నం చేస్తామన్నారు. పద్మశ్రీ వన జీవి రామయ్య మనకు కనిపించనంత దూరంగా వెళ్ళి పోవడం
దురదృష్టకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పక్షాన భగవంతుడ్ని వేడుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పొంగులేటి రామయ్య కుటుంబ
సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనేక మంది చాలా కాలం జీవిస్తారని, కానీ వారు జీవించినంత కాలం
ఏం సాధించామని ప్రశ్నించుకోవడంలో విఫలమవుతారని అన్నారు. వన జీవి రామయ్య మాత్రం, దేశం మొత్తం గౌరవించే విధంగా
జీవించారని పొంగులేటి కొనియాడారు. చెట్లు పెంచడంలో కష్టాలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా, ఒడిదొడుకులు ఎన్ని వచ్చినా
ఆటన్నిటినీ అధిగమించి కోటికి పైగా మొక్కలు నాటి పద్మశ్రీ సాధించారని ప్రసంశించారు.
మొక్కలు పెంచడమే కాకుండా, వేలాది ఎకరాల్లో కోట్లాది విత్తనాలు చల్లారని చెప్పారు. ఎక్కడ
ఖాళీ స్థలం కనిపించినా వదిలి పెట్ట లేదని, చివరకు రోడ్ల ప్రక్కన కూడా విత్తనాలు
చల్లి చెట్లు పెంచారని పేర్కొన్నారు. ఈ మొక్కలు పెంచడంలో ఆర్ధిక పరిస్థితి సహకరించక
పోయినా,
ఒక పూట తిన్నా
తినక పోయినా మొక్కలు పెంచడంలో వున్న ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ తన లక్ష్యం కోసం
ముందుకు సాగారన్నారు. ఫలితంగా, ఈ ప్రాంతమంతా మాహాద్భుతంగా పచ్చదనాన్ని పరుచుకుందని అన్నారు.
మంత్రి పొంగులేటి వెంట ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్
కార్పొరేషన్ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు తదితరులున్నారు.

Comments
Post a Comment