ఇక భద్రాద్రికి కొత్త శోభ

దక్షిణ అయోధ్య భద్రాద్రి అభివృద్ధికి అడుగులు టెంపుల్ సిటీగా మారనున్న భద్రాద్రి రామాలయం భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సీఎం అంగీకారం భూసేకరణకు 34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం కొత్త శోభను సంతరించుకోబోతోంది. శ్రీరామ నవమి నవమికి ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామాలయ అభివృద్ధికి భూ సేకరణ జరిపేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూ సేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కి దృష్టికి తీసుకు వెళ్లగా , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ 34 కోట్లు నిధులను విరుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాచలం టెంపుల్ సిటీకగామారాబోతోంది. అడిగిందే తడవుగా ఆదివారం ఆలయ ఈఓ , పండితులు ముఖ్య మంత్రిని కలిసి భద్రాచల సీతారామచంద్ర స్వామి శ్రీరామ నవమి...