అన్నం మెతుకులపై కులాన్ని అంటించి రాజకీయ లబ్ధి

కుల మత కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనడం నేరం మాస్ లైన్ జన బోజనాల్లో రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు కుల మత కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనటం నేరమని సీపీఐ( ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. అన్నం మెతుకులపై కులాన్ని అంటించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుల భోజనాలను ఏర్పాటు చేస్తున్నారని , రాజ్యాంగం పై ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు కులమత కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించేందుకు సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో కుల మతాతీత జాన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాల పేరుతో ప్రజలను వాడుకొని విభజిస్తున్నారని విమర్శించారు. విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య మాట్లాడుతూ కుల మతాలు మధ్య వైరుధ్యాలను పెంచి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని , వీటికి వ్యతిరేకంగా అశేష ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. మాజీ మావోయిస్టు జంపన్న మాట్లాడుతూ కుల భోజనాలకు పోవడాన్ని చాలా మంది గొప్పగా భావిస్తున్నారని , వాటికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పరచాల్సిన బ...