కడు రమ్యం ... రాములోరి కళ్యాణం
మంగళ వాయిద్యాలు , వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా రాములోరి కళ్యాణం భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సీతమ్మ వారికి మాంగళ్య ధారణ పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా , దేశం నలు మూలాల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు దక్షణ అయోద్యగా పేరు గాంచిన భద్రాద్రి లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమ్యంగా జరిగింది. మిథులా స్టేడియంలో ఈ మహాద్భుత ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు , వేద పండితుల మంత్రోచ్చరణలు , భక్తుల జయ జయ ద్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వేద పండితులు ఈ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. కళ్యాణం జరుగుతున్నంత సేపూ ఆలయ పరిసరాలు , మాడ వీధులు రామ నామ స్మరణతో మార్మోగి పోయాయి. తెలంగాణ ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా , సతీ సమేతంగా పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి , శాస్త్రోక్తంగా వాటిని అర్చక స్వాములకు అందజేశారు. ఆ తర్వాత , అర్చక స్వాములు వాటి...